తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Rohan Bopanna: రోహన్ బోపన్న అరుదైన రికార్డు… ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ కైవసం

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భారత డబుల్స్ దిగ్గజం రోహన్ బోపన్న 43 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో రోహన్ బోపన్న- మాథ్యూ ఎబ్డెన్ జోడీ 7-6 (7-0), 7-5తో ఇటలీ ద్వయం సిమోన్ బొలెల్లి- ఆండ్రియా వావోసోరిపై విజయం సాధించింది. రెండు సెట్లు హోరాహోరీగా సాగినప్పటికీ చివరికి బోపన్న-ఎబ్డెన్ జోడీదే పైచేయిగా నిలిచింది.

Also Read: ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సంచలన విజయం..21 ఏళ్ల తర్వాత

రోహన్ బోపన్న కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు, గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన అతి పెద్ద వయసు ఆటగాడిగా బోపన్న అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో బోపన్న-ఎబ్డెన్ లకు ట్రోఫీతో పాటు 6.06 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. తాజాగా పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో రోహన్ బోపన్న నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డుకు కూడా ఎంపికయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button