తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Bobby Deol: సూర్య ‘కంగువా’ మూవీ అప్‌డేట్.. విలన్ పోస్టర్ రిలీజ్?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కంగువా’. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని శివ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ‘యానిమల్‌’ ఫేమ్ విలన్‌ బాబీ దేవోల్‌ ఇందులో కూడా విలన్‌గా నటిస్తున్నారు. బాబీ దేవోల్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో బాబీ ఫస్ట్‌లుక్‌ను సోషల్ మీడియా వేదికగా శనివారం మేకర్స్ విడుదల చేశారు. ‘క్రూరమైన, శక్తిమంతమైన, మర్చిపోలేని.. ఉధిరన్‌’ అంటూ క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారుతోంది.

ALSO READ: త్వరలోనే రకుల్ పెళ్లి.. ముహుర్తం ఫిక్స్

సినిమాపై భారీ అంచనాలు

ఈ పోస్టర్‌లో బాబీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న ఆయనకు ఆ వర్గ ప్రజలంతా తమ మద్దతు తెలుపుతున్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కాగా, ఇటీవల సూర్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు బాబీ లుక్‌తో మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button