తెలుగు
te తెలుగు en English
క్రికెట్

AUS vs WI: ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ సంచలన విజయం..21 ఏళ్ల తర్వాత

బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌పై వెస్టిండీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులు చేయగా.. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 289/9 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో వెస్టిండీస్‌కి 22 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 193 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.

ALSO READ: ఇంగ్లండ్ ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

21 ఏళ్ల తర్వాత విజయం

215 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 50.5 ఓవర్లలో 207 పరుగులకి ఆలౌట్ అయ్యింది. స్టీవెన్ స్మిత్ (91), కామెరాన్ గ్రీన్ (42), మిచెల్ స్టార్క్(21) రాణించగా.. ఉస్మాన్ ఖవాజా(10), మార్నస్ లాబుషేన్ (5), ట్రావిస్ హెడ్(0), మిచెల్ మార్ష్(10), అలెక్స్ కారీ (2), పాట్ కమిన్స్ (2), నాథన్ లియోన్(9), జోష్ హేజిల్‌వుడ్(0) విఫలమయ్యారు. వెస్టిండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ 7 వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించాడు. కాగా, ఆస్ట్రేలియాపై వెస్టిండీస్‌ 21 ఏళ్ల తర్వాత విజయదుందుభి మోగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button