తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vishwambhara: విశ్వంభర.. చిరంజీవి కెరీర్‌ల్లోనే అత్యంత భారీ రేటు!

మెగాస్టార్ చిరంజీవి, బింబిసార దర్శకుడు వశిష్ట కాంబోలో తెరకెక్కనున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాలో హీరో అయిదు లోకాలు తిరుగుతాడని, ఇందులో అయిదుగురు హీరోయిన్లు ఉంటారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల విడుదలైన విశ్వంభర టైటిల్ వీడియో సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. తాజాగా, ఈ సినిమా నుంచి ఓ అప్‌డేట్ సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది.

ALSO READ: సూర్య ‘కంగువా’ మూవీ అప్‌డేట్.. విలన్ పోస్టర్ రిలీజ్?

చిరు కెరీర్‌లోనే భారీ రేటు

విశ్వంభర సినిమా ఓవర్సీస్ హక్కులు భారీ ధరకు అమ్ముుడ పోయాయని వార్త వినిపిస్తోంది. యూవీ క్రియేషన్స్ ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా హక్కులను ఏకంగా రూ.18 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అయితే చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ రేటుకు అమ్ముడుపోయాయి. కాగా, ఈ సినిమా ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేసిందంటే.. తర్వాత ఇంకెంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుందోనని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button