తెలుగు
te తెలుగు en English
టెన్నిస్

Janic Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్ ఓటమి… ఫైనల్‌కి దూసుకెళ్ళిన సిన్నర్

డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జకోవిచ్ కు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో దిగ్భ్రాంతికర ఓటమి ఎదురైంది. టెన్నిస్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో జరిగిన సెమీఫైనల్లో ఇటలీ ఆటగాడు జానిక్ సిన్నర్ 6-1, 6-2, 7-6, 6-3తో జకోవిచ్ ను మట్టికరిపించాడు. తద్వారా జకోవిచ్ 33 మ్యాచ్ ల విజయప్రస్థానానికి అడ్డుకట్ట వేశాడు.

Also Read: రోహిత్ కాళ్లు మొక్కిన యువకుడు.. కేసులు నమోదు చేసిన పోలీసులు

ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను రికార్డు స్థాయిలో 10 సార్లు గెలిచిన సెర్బ్ వీరుడు జకోవిచ్ ఇవాళ సిన్నర్ ముందు ఓ సాధారణ ఆటగాడిలా కనిపించాడు. అటు సర్వీసులు, ఇటు బ్యాక్ హ్యాండ్, ఫోర్ హ్యాండ్ షాట్లతో విజృంభించాడు. అయితే మూడో సెట్ లో ఎదురుదాడికి దిగిన జకోవిచ్ ఆ సెట్ ను టైబ్రేకర్ వరకు తీసుకెళ్లి విజయం సాధించాడు. కానీ నాలుగో సెట్ సిన్నర్ దే హవా నడిచింది. పలుమార్లు జకోవిచ్ సర్వీసును బ్రేక్ చేసిన సిన్నర్ చివరికి మ్యాచ్ ను కైవసం చేసుకున్నాడు.

Also Read: అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు.. ఐర్లాండ్ చిత్తు

కాగా, జానిక్ సిన్నర్ తన కెరీర్ లో ఓ గ్రాండ్ స్లామ్ ఓపెన్ లో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఆదివారం జరిగే ఫైనల్లో సిన్నర్… మెద్వెదెవ్, జ్వెరెవ్ లలో ఒకరిని ఎదుర్కొంటాడు. ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో డానిల్ మెద్వెదెవ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ తలపడనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button