తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Dhoni: ఓ వైపు పరుగుల వరద.. మరోవైపు రికార్డుల మోత.. దటీజ్ ధోనీ!

చాలా రోజుల తర్వాత ఎం.ఎస్. ధోనీ తన ఫ్యాన్స్‌‌లో ఫుల్ జోష్‌ని నింపాడు. ఆయన బ్యాటింగ్ కోసం ఎప్పుడెప్పుడా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన ఫ్యాన్స్ కళ్లల్లో చెప్పలేని ఆనందం కనిపించింది. నిన్న విశాఖపట్టణం వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినా, ఆ జట్టు ఫ్యాన్స్ మాత్రం ఏమాత్రం నిరాశ చెందలేదు. దానికి కారణం ధోనినే.. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు రావడమే కాదు ధనాధన్‌ షాట్లతో అలరించాడు. 16 బంతులాడిన అతను 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు బాదాడు. అతను బౌండరీ కొట్టినప్పుడల్లా స్టేడియం దద్దరిల్లింది. ఒక్క ఓవర్ గనుక ముందు వచ్చి ఉంటే కచ్చితంగా చెన్నై గెలిచి ఉండేదని అందరూ అనుకున్నారు.

ALSO READ: సన్‌రైజర్స్ చిత్తు… అలవోకగా గెలిచిన గుజరాత్

మరోవైపు.. ఐపీఎల్‌లో ఎం.ఎస్. ధోనీ రికార్డుల మోత మోగిస్తున్నారు. విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ధోని ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షాను ఔట్ (క్యాచ్) చేసిన ధోని, టీ20 క్రికెట్‌లో 300 ఔట్‌లు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్‌ ధోనీనే కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ధోని ఇప్పటికే మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్వింటన్ డి కాక్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button