తెలుగు
te తెలుగు en English
క్రీడలు

SRH vs GT: సన్‌రైజర్స్ చిత్తు… అలవోకగా గెలిచిన గుజరాత్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. గుజరాత్ టైటాన్స్‌ ఆల్ రౌండ్ షోతో సన్‌రైజర్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ విధించిన 163 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ సునాయసంగా చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు సాయి సుదర్శన్(44), డేవిడ్ మిల్లర్(44), శుభ్‌మన్ గిల్(36) చెలరేగారు. గుజరాత్ బౌలర్లు కట్టడి చేయడంతో సన్‌రైజర్స్ 162/8 పరుగులు చేసింది. సీనియర్ బౌలర్ మోహిత్ శర్మ(3/25) హైదరాబాద్‌ను కట్టడి చేశాడు. ఈ సీజన్ లో గుజరాత్‌కు ఇది రెండో విజయం.

Also Read: సన్ రైజర్స్ టీంకు బిగ్ షాక్.. జట్టుకు కీలక ప్లేయర్ దూరం

163 పరుగుల మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వేసిన ఐదో ఓవర్లో వృద్దిమాన్ సాహా వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడిన సాహా ఒక ఫోర్, 2 సిక్సులతో 13 బంతుల్లో 25 పరుగులు చేశాడు. అనంతరం సాయి సుదర్శన్‌తో కలిసి మరో ఓపెనర్ గిల్ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. అయితే 2 ఫోర్లు, ఒక సిక్సుతో 28 బంతుల్లో 36 పరుగులు చేసిన గిల్‌ను మరో స్పిన్నర్ మయాంక్ మార్కండే 10వ ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. దీంతో 74 పరుగులకు గుజరాత్ 2 వికెట్లు కోల్పోయింది.

Also Read: పాక్ క్రికెట్ లో కెప్టెన్సీ లొల్లి.. బాబర్ కే మళ్లీ పగ్గాలు

అనంతరం సాయి సుదర్శన్, మిల్లర్ కలిసి మూడో వికెట్‌కు 64 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న సాయి సుదర్శన్‌ను 17వ ఓవర్లో పాట్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. 36 బంతులు ఎదుర్కొన్న సాయి సుదర్శన్ 4 ఫోర్లు, ఒక సిక్సుతో 45 పరుగులు చేశాడు. దీంతో 138 పరుగుల వద్ద గుజరాత్ మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం మిల్లర్, విజయ్ శంకర్ తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు.

9 Comments

 1. Its like you read my mind! You appear to know a lot about this, such as you wrote the book in it or something.
  I believe that you just could do with some p.c.

  to pressure the message house a bit, but other than that, this is wonderful blog.
  A great read. I will certainly be back.

  Also visit my site :: vpn coupon 2024

 2. It’s the best time to make some plans for the
  future and it is time to be happy. I have read this post and if I could I desire to suggest you some interesting things or suggestions.
  Perhaps you could write next articles referring to this
  article. I want to read more things about it!

  Here is my homepage :: vpn coupon 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button