తెలుగు
te తెలుగు en English
క్రీడలు

WPL 2024: సరికొత్త చాంపియన్ ఆర్‌సీబీ

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కప్‌ కల నెరవేరింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్)లో ఆర్‌సీబీ సరికొత్త చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌ ఫైట్‌లో నిలిచిన తొలిసారే టైటిల్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఢిల్లీ వేదికగా 30 వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్‌ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్‌సీబీ చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది.

ALSO READ: క్రికెట్ లో కొత్త రూల్.. ప్లేయర్లకు కష్టమేనా?

తొలుత ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. శ్రేయాంక పాటిల్‌ (4-12), సోఫీ మిలోనెక్స్‌(3-20)..ఢిల్లీ పతనాన్ని శాసించారు. షెఫాలీవర్మ (44), మెగ్‌ ల్యానింగ్‌ (23) ఆకట్టుకోగా, రోడ్రిగ్స్‌(0), కాప్సె (0), కాప్‌ (8), జొనాసెన్‌ (3), రాధాయాదవ్‌ (12) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బెంగళూరు 19.3 ఓవర్లలో 115-2 స్కోరు చేసింది. ఎలీస్‌ పెర్రీ(35 నాటౌట్‌), డివైన్‌(32) రాణించారు. శిఖాపాండే, మణి ఒక్కో వికెట్‌ తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిలోనెక్స్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా దీప్తిశర్మ నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button