తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Song Release: గూస్ బంప్స్ తెప్పిస్తున్న సాంగ్‌… మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే!

శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది.

Also Read: ఓటీటీలోకి పిండం మూవీ… అదిరిపోయిన రెస్పాన్స్!

ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి ‘శివ ట్రాప్ ట్రాన్స్’ పాటని రిలీజ్ చేశారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణీ ఈ పాటని లాంచ్ చేశారు. శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించింది. చైతన్య ప్రసాద్ అందించిన లిరిక్స్ అద్భుతంగా వున్నాయి. సింగర్ కాలభైరవ హై ఎనర్జీతో పాడిన ఈ పాట నిజంగానే ఒక ట్రాన్స్ లోకి తీసుకెళుతుంది. ఈ పాట లిరికల్ విజువల్స్ AI చాట్ జీపీటీని ఉపయోగించి రూపొందించారు. ఇండియన్ సినిమాలో మొదటి 𝐀𝐈 జెనరేటడ్ లిరికల్ వీడియో ఇదే కావడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button