తెలుగు
te తెలుగు en English
క్రికెట్

RCB Vs KKR: బెంగళూరు- కోల్ కత్తా మధ్య మ్యాచ్.. అందరి దృష్టి అటువైపే

ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు బాగా క్రేజ్ ఉంటుంది. వాటిలో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఒకటి. ఆర్సీబీ తరపున కోహ్లీ.. కేకేఆర్ తరపున గౌతమ్ గంభీర్ ఉండడమే దీనికి కారణం. వీరిద్దరు గతంలో చాలా సార్లు మైదానంలో గొడవపడిన సంగతి తెలిసిందే. చివరి రెండు సీజన్లు లక్నో జట్టు తరపున మెంటార్ గా వ్యవహరించిన గంభీర్.. ప్రస్తుత సీజన్ లో మళ్లీ తనకిష్టమైన జట్టుకు తిరిగి వచ్చేశాడు.

Also read: India Vs Australia: భారత్- ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్.. వేదికలివేనా?

ఐపీఎల్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ, గంభీర్ పైనే ఉంది. ఇద్దరూ ఎంత ఉత్సాహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2023 సీజన్ లో లక్నో, బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మ్యాచ్‌ అయిపోయాక ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ, నవీన్‌ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కైల్‌ మేయర్స్‌, విరాట్‌ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్‌ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు.

అలాగే 2013 ఐపీఎల్ లో కోహ్లీ, గంభీర్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో గొడవ జరిగింది. నేడు మరోసారి ఈ రెండు జట్లు తలబడుతుండడంతో ఈ మ్యాచ్ పై ఆసక్తి పెరిగిపోయింది. బలాబలాలను చూస్తే కేకేఆర్ పటిష్టంగా కనిపిస్తుంది. ఎప్పటిలాగే గంభీర్, కోహ్లీ తమ దూకుడు కొనసాగిస్తారా.. లేకపోతే సైలెంట్ గా ఉంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button