తెలుగు
te తెలుగు en English
మరిన్ని

PV Sindhu: రాకెట్‌ను నేల‌కేసి కొట్టిన పీవీ సింధు… ఎల్లో కార్డు జారీ

మాడ్రిడ్ స్పెయిన్ మాస్ట‌ర్స్ బ్యాడ్మింట‌న్ టోర్నీలో పీవీ సింధు క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో ఓట‌మిపాలైంది. థాయిలాండ్‌కు చెందిన సుప‌నిద కేటితాంగ్ చేతిలో సింధు ప‌రాజ‌యం చ‌విచూసింది. గంటా 17నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ నెగ్గి శుభారంభం చేసిన సింధు.. మిగతా రెండు గేమ్‌లను కోల్పోయింది. అయితే ఓట‌మి త‌ట్టుకోలేక సింధు .. గేమ్ ముగిశాక తన చేతుల్లో ఉన్న రాకెట్‌ను నేల‌కు కొట్టింది. ఈ ఘ‌ట‌న‌ను నిర్వాహ‌కులు సీరియ‌స్‌గా తీసుకున్నారు. ప్ర‌వ‌ర్త‌న స‌రిగా లేని కార‌ణంగా.. పీవీ సింధుకు ఎల్లో కార్డు జారీ చేశారు. చైర్ అంపైర్ ఆ కార్డు జారీ చేశాడు.

Also Read: బెంగళూరు- కోల్ కత్తా మధ్య మ్యాచ్.. అందరి దృష్టి అటువైపే

ఆరో సీడ్ సుప‌నిద కేటితాంగ్ 24-26 21-17 22-20 స్కోరుతో వీపీ సింధుపై విజ‌యం సాధించింది. తొలి గేమ్ 4-8 తేడాతో వెనుక‌బ‌డి ఉన్న సింధు ఆ త‌ర్వాత త‌న జోరును పెంచి తొలి గేమ్‌ను 24-26 తేడాతో కైవ‌సం చేసుకుంది. టోర్నీ నుంచి స్పెయిన్ క్రీడాకార‌ణి క‌రోలినా మారిన్ త‌ప్పుకోవ‌డంతో ..పీవీ సింధు టోర్నీ ఫెవ‌రేట్‌గా నిలిచారు.

Also Read: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదుర్స్!

మరోవైపు, మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమిత్ రెడ్డి-సిక్కిరెడ్డి జోడీ సత్తాచాటింది. ఈ జోడీ సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో సక్కిరెడ్డి జోడీ 14-21, 21-11, 21-17 తేడాతో ఇండోనేషియాకు చెందిన కుషార్జాంటో-కుసుమావతిపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్-ధ్రువ్ కపిల, ఉమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో, అశ్విని పొన్నప్ప జంటలకు నిరాశే ఎదురైంది. క్వార్టర్స్‌లో అర్జున్-ధ్రువ్ 19-21, 23-21, 17-21 తేడాతో జునైది ఆరిఫ్-రాయ్ కింగ్ యాప్(మలేషియా) జోడీ చేతిలో పోరాడి ఓడింది. అశ్విని-తనీషా జంటపై 13-21, 19-21 తేడాతో లీ చియా హ్సిన్-టెంగ్ చున్ హ్సున్(చైనీస్ తైపీ) జోడీ గెలుపొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button