తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL: ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదుర్స్!

ఐపీఎల్ చరిత్రలోనే నిన్న అరుదైన రికార్డు నమోదైంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా హైదరాబాద్ సన్ రైజర్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్​ రైజర్స్ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (277/3) సాధించిన టీంగా రికార్డ్ సృష్టించింది. అయితే లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ వచ్చిన ముంబై బ్యాటర్స్ కూడా ఏమాత్రం తగ్గలేదు. విజయం కోసం సాయశక్తుల ప్రయత్నించారు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి.

ALSO READ: శుభ్ మన్ గిల్ కు భారీ జరిమానా.. కారణం అదేనా?

20 ఓవర్లలో 277/3 స్కోరుతో ఐపీఎల్‌లో అత్యంత విధ్వంసక జట్టుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిలిచింది. ట్రావిస్‌ హెడ్‌ (62; 24 బంతుల్లో 9×4, 3×6), అభిషేక్‌ శర్మ (63; 23 బంతుల్లో 3×4, 7×6), హెన్రిచ్‌ క్లాసెన్‌ (80 నాటౌట్‌; 34 బంతుల్లో 4×4, 7×6).. ఈ ముగ్గురూ కలిసి ఉప్పల్‌ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించారు. ముంబై ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో రెచ్చిపోయారు. తిలక్‌ వర్మ (64; 34 బంతుల్లో 2×4, 6×6), టిమ్‌ డేవిడ్‌ (42 నాటౌట్‌; 22 బంతుల్లో 2×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (34; 13 బంతుల్లో 2×4, 4×6) గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. చివరికి 246/5తో ముంబై ఓటమి పాలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button