తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: పాలనపై ఫీడ్‌బ్యాక్‌.. రెండోరోజు ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి!

వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి వైసీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్‌ మోగించారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర తొలి రోజు కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మూడు నియోజకవర్గాల మీదుగా సాగింది. ప్రజాసంకల్ప పాదయాత్ర తరహాలో బస్సుయాత్రలోనూ రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ మమేకమవుతున్నారు.

ALSO READ: కూటమి నుంచి వలసలు.. వైసీపీలో కోలాహలం!

జగన్‌కు అభివాదం..

ఇడుపులపాయంలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు చేరుకున్న వెంటనే బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని జగన్‌కు జై జగన్.. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. రోడ్ షోలో వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద వేంపల్లి హనుమాన్ జంక్షన్‌లో వైఎస్ జగన్‌కు గజమాలలతో స్థానికులు స్వాగతం పలికారు. ఈ సమయంలో వైఎస్ జగన్‌పై పూలవర్షం కురిపించారు.

ALSO READ: సీఎం జగన్‌ బస్సు యాత్ర.. తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజానీకం

పెంచికలపాడులో బస..

ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రారంభమైంది. ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు. ప్రజల నుంచి తన పాలనపై ఫీడ్‌బ్యాక్‌తో పాటు మరింత మెరుగుపర్చుకునేందుకు సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సే­నా­పురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేక­మవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button