తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: సీఎం జగన్‌ బస్సు యాత్ర.. తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజానీకం

ఆంధ్రప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల్లోకి వచ్చేశారు. ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ యాత్ర కుమారునిపల్లి, వేంపల్లి, సర్వరాజుపేట, వీరపునాయనిపల్లి (కమ­లాపురం), గంగిరెడ్డిపల్లి, ఊరుటూరు, యర్రగుంట్ల (జమ్మలమడుగు), పోట్లదుర్తి మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు సీఎం జగన్‌ చేరుకుంటారు.

ALSO READ: జగన్ మరో యాత్రకు శ్రీకారం.. నేటినుంచే ప్రచారం!

జగనన్నకు స్వాగతం..

సీఎం జగన్‌ బస్సు యాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజానీకం తండోపతండాలుగా తరలివచ్చారు. కాగా, వీరపనాయనిపల్లి మండలంలోని తంగేడు పల్లి క్రాస్ రోడ్డు వద్ద మహిళలు పెద్దసంఖ్యలో బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్‌ తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ యాత్ర వీరపునాయునిపల్లె, యర్రగుంట్ల మీదగా పొద్దుటూరు చేరుకోనుంది. ఇక ఈ పర్యటనలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆయన ప్రజల్లోకి రావడం గమనార్హం.

ALSO READ: కూటమి నుంచి వలసలు.. వైసీపీలో కోలాహలం!

సర్వత్రా ఉత్కంఠ..

ప్రొద్దుటూరు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతారు. అయితే ఈ సభలో జగన్ ఏం మాట్లాడుతారనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సభ అనంతరం సున్నపురాళ్లపల్లి, దువ్వూరు, జిల్లెల, నాగలపాడు, బోధనం, రాంపల్లె క్రాస్, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బైపాస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మొత్తం 21 రోజుల పాటు సాగనున్న ఈ బస్సుయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button