తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

RamCharan: రామ్ చ‌ర‌ణ్‌కు ఐకాన్ స్టార్ స్పెష‌ల్ బ‌ర్త్ డే విషెస్.. వీడియో వైరల్

చిరుత సినిమాతో హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మెగా పవర్ స్టార్ అనిపించుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ తన నటనతో మెప్పించి ఆస్కార్ వేదికగా అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ సినిమాలకు ఇప్పుడు ప్రేక్షకలోకం నీరాజనం పడుతున్నారు. ఇవాళ చెర్రీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రముఖులతోపాటు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియజేశారు.

ALSO READ: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, అదితీ

బ‌న్నీ, చెర్రీ డ్యాన్స్..

సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు, పారిశ్రామికవేత్తలు చ‌ర‌ణ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే తాజాగా, చ‌ర‌ణ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ‌ర్త్‌డే విషెస్ తెలిపాడు. ఈ సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియోలో హ్యాపీ బ‌ర్త్ డే మై మోస్ట్ స్పెష‌ల్ క‌జిన్‌.. ల‌వ్ యూ అంటూ పోస్ట్ చేసి విషెస్ తెలిపాడు. ఈ వీడియోలో బ‌న్నీ, చెర్రీ కలిసి డ్యాన్స్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button