తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Sania Mirza: హైదరాబాద్ సీటుపై హస్తం గురి.. తెరపైకి సానియా మీర్జా పేరు?

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించాలని వ్యుహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో ఆచూతూచీ వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో సీరియస్‌గా వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణలు, కరిష్మా, అంగ బలం, అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలను బరిలోకి దించాలని చూస్తోంది. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్‌లో అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. ఇందులో భాగంగా, హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అనూహ్యంగా తెరపైకి కొత్త వ్యక్తిని తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మజ్లిస్ కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

Also read: CM Revanth: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓడించేందుకు పక్కా వ్యుహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మహిళను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ సైతం ఓవైసీకి ధీటైనా అభ్యర్థిని బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి మొదట టీమిండియా మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్ పేరును ఏఐసీసీ పరిశీలించగా.. ఆయన మాత్రం టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును ప్రతిపాదించారని సమాచారం. అధిష్టానం కూడా సానియా మీర్జా‌ పట్ల సానూకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టెన్సిస్ స్టార్ ప్లేయర్‌గా దేశవ్యాప్తంగా సానియా మీర్జాకు గుర్తింపు ఉండటం.. దీంతో పాటు హైదరాబాద్‌కే చెందిన మహిళ కావడం మరింత కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. సానియా అయితే ఓవైసీకి ధీటైన అభ్యర్థి అని కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నట్లు టాక్. దీంతోనే హైదరాబాద్ పార్లమెంట్ నుండి సానియా మీర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

గతంలో సానియా మీర్జా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడం కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సానియా మీర్జా పేరు ఎంపీ అభ్యర్థిగా కన్ఫామ్ అయ్యిందని.. కాంగ్రెస్ నెక్ట్స్ లిస్ట్‌లో ఆమె పేరు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై సానియా మీర్జా కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా సానియా మీర్జా బరిలోకి దిగుతున్నారో లేదో తెలియాలంటే.. ఆ పార్టీ అభ్యర్థుల నెక్ట్స్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ సీఈసీ భేటీ కానుంది. ఈ భేటీలో మిగిలిన 8 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల గురించి చర్చించి.. ఆ తర్వాత ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. మరి జాబితాలో సానియా పేరు ఉంటుందో.. ఉండదో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button