తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

CM Revanth: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్

లోక్ సభ ఎన్నికలు దగ్గపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తీసుకరావడానికి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరపనుంది. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై మీటింగ్ లో కీలకంగా చర్చించనున్నారు. అందులో భాగంగా సాయంత్రం 6 గంటలకు AICC హెడ్ ఆఫీస్ లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మీటింగ్ జరగనుంది.

Also read: Delhi Liquor Scam: తీహార్ జైలుకి ఎమ్మెల్సీ కవిత

మీటింగ్ కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్, కేసీ వేణుగోపాల్ హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ సీఈసీ మీటింగ్ కు హాజరుకానున్నారు. రాష్ట్రంలో మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. మొత్తం 17 సీట్లలో ఇప్పటివరకు రెండువిడతల్లో 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించారు.

పెండింగ్ లో ఉన్న ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ స్థానాలకు ఇవాళ అభ్యర్థులు ఫైనల్ చేసే అవకాశముంది. పెండింగ్ లో ఉన్న వాటిల్లో ఖమ్మం, భువనగిరిలో అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తోంది హైకమాండ్. ఈ రెండు చోట్ల ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో… ఎవరికి టికెట్ ఇవ్వాలనే దానిపై తర్జనభర్జన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button