తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Siddarth: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్, అదితీ

తమిళ్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితీ రావు హైదరీ గత కొంత కాలంగా లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరరూ ఇవాళ పెళ్లితో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో శ్రీరంగపురం ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షలతో వీరి వివాహం జరిగింది.

ALSO READ: ఓటిటిలోకి వచ్చేస్తున్న గామి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగా.. సిద్దార్థ్, అదితిరావు హైదరి.. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. 2003లో మేఘనను సిద్ధార్థ్‌ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అనంతరం ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో.. విడిపోయారు. ఆ తర్వాత సిద్ధార్థ్‌ విషయంలో మళ్లీ పెళ్లి అంటూ ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. చివరకు అదితిరావు హైదరిని ఇలా రహస్యంగా వివాహం చేసుకుని.. మళ్లీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. అదితి రావు కూడా 2002లో లాయర్, యాక్టర్ అయిన సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకుని.. ఆ తర్వాత విడాకులు తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button