తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Gaami: ఓటిటిలోకి వచ్చేస్తున్న గామి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన సరికొత్త కథా చిత్రం గామి. కొత్త దర్శకుడు విద్యాధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా.. మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. వినూత్న కథా, కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు ఆరు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ కోసం టీమ్ చాలా కష్టపడ్డారు. అవే ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించాయి.

Also read: Family Star: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో అప్డేట్.. మూవీ నుంచి ఇంకో సాంగ్ రిలీజ్

ఇక విడుదలైన మొదటి షో నుండే గామి సినిమాకు ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడంతో.. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. దాంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాధించింది గామి. కేవలం మూడు రోజుల్లోనే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. లాంగ్ రన్ లో మేకర్స్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది గామి. అయితే తాజాగా గామి సినిమా థియేట్రికల్ రన్ ముగించుకోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

గామి సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు థియేటర్స్ లో విడుదలైన దాదాపు నెలరోజులకి అనగా ఏప్రిల్ 5న ఓటీటీలో విడుదల కానుందట. ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన గామి సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button