తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Family Star: ఫ్యామిలీ స్టార్ నుంచి మరో అప్డేట్.. మూవీ నుంచి ఇంకో సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్సలో బిజీగా ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

Also read: OM Bheem Bush: మాయ చేస్తున్న ఓం భీం బుష్.. కలెక్షన్ల వసూళ్లు

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశారు. అందులోనూ విజయ్ లుక్ అందరినీ తెగ ఆకట్టుకుంది. దాంతో సినిమా కోసం రౌడీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో మెలోడీ సాంగ్ విడుదలైంది. ప్రస్తుతం ఈ సాంగ్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది.

‘మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి’.. అని సాగే లిరిక్స్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటని శ్రీమణి రాయగా శ్రేయ ఘోషల్ స్వరాలు వినిపించింది. గోపీ సుందర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button