తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: అగ్రవర్ణాలకే సీట్లు..నమ్మకస్తులకు పవన్ వెన్నుపోటు!

రాజకీయాల్లో వెన్నుపోటు అనేది సర్వ సాధారణమైపోయింది. ఒకే పార్టీలో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకోవడం నేతలకు అలవాటు అయిపోయింది. కాకపోతే వెన్నుపోటు అంటే రాజకీయ ప్రత్యర్థులకు గుర్తొచ్చేది చంద్రబాబు పేరు. తాజాగా, చంద్రబాబు బాటలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణం మొదలుపెట్టారు. జనసేన అధినేత ఆ పార్టీ తరఫున డబ్బున్న, అగ్రవర్ణాలకే సీట్లు ఇచ్చి తన సొంత పార్టీ నేతలతోపాటు జనసైనికులకు వెన్నుపోటు పొడవడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ:  వైసీపీ ఎన్నికల ప్రచార భేరి.. రాష్ట్రంలో 27నుంచి నయాజోష్

జనసైనికులు నమ్ముతారా?

దేశంలో ఏ పార్టీ కూడా తనకంటూ ఒక లక్ష్యం లేకుండా పనిచేయదు. కానీ వీటన్నింటికి విరుద్ధంగా పవన్‌ తీరు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్‌ స్థానాలకు జనసేన పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో 18 మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఇందులో రెండు స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. ఓసీలకు ఏకంగా 12 సీట్లు, మహిళలకు ఒక్క సీటు ఇవ్వడంతో జనసైనికులు ఆయనను ఎలా నమ్ముతారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. భీమవరం, తిరుపతి, అనకాపల్లి, పెందుర్తి స్థానాల్లో పక్క పార్టీ నేతలకు పిలిచి టికెట్లు ఇవ్వడంపై పార్టీ నేతల్లో సందిగ్ధత నెలకొంది.

ALSO READ: పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు ముద్రగడ భారీ స్కెచ్!

నమ్మకస్తులకు మొండి చెయ్యి..

జనసైనికులకు జనసేనాని మొండి చెయ్యి చూపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారితోపాటు గత ఎన్నికల్లో ఓటమిపాలైనా నాయకులు సైతం పార్టీని వీడకుండా నమ్మకంగా ఉంటున్నారు. అయితే బాబుతో చేతులు కలిపిన తర్వాత పవన్ కల్యాణ్ జనసైనికులను పట్టించుకోవడం లేదు. కనీసం జనసేన నేతలతో చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న బొలిశెట్టి సత్య, కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్, పంచకర్ల సందీప్, ఉషా చరణ్, బొలిశెట్టి సత్యనారాయణ, బోలుబోయిన శ్రీనివాస్ యాదవ్, రాయపాటి అరుణ, పోతిన మహేష్, ముత్త శశిధర్, రియాజ్, జానీ మాస్టర్, పితాని బాలకృష్ణ వంటి నమ్మకస్తులకు పవన్ హ్యాండ్‌ ఇచ్చారు. దీంతో ఆ నేతల అనుచరులు భరించలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button