తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Taapsee: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

ప్రముఖ హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మథియాస్ బో అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌తో ఈ ముద్దుగుమ్మ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌ (2013)లో ఆడేందుకు మథియాస్ భారతదేశానికి వచ్చినప్పుడు, తాప్సీ మథియాస్ బోను కలుసుకుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

ALSO READ: మాయ చేస్తున్న ఓం భీం బుష్.. కలెక్షన్ల వసూళ్లు

10 ఏళ్లకు పైగా డేటింగ్ చేసిన ఈ జంట ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరి వివాహం మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగినట్లు సమాచారం. అయితే, ఈ వివాహానికి తాప్సీ ఎవరినీ ఆహ్వానించలేదట. తాప్సీ తమ వివాహాన్ని ప్రైవేట్‌గా చేసుకోవాలని ప్లాన్ చేసిందని, అందుకే సెలబ్రిటీలను ఆహ్వానించలేదని అంటున్నారు. ఆమె సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అలాగే పెళ్లికి వచ్చిన వారి ఫొటోలు తీసి ప్రచురించకూడదని షరతు విధించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button