తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Irfan Pathan: గుజరాత్‌తో ముంబై ఓటమి… హార్ధిక్‌పై విమర్శలు

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఈ ఐపీఎల్ సీజన్ ఏ మాత్రం మంచి ప్రారంభాన్ని ఇవ్వలేకపోయింది. తొలి మ్యాచ్ లోనే గుజరాత్ టైటాన్స్ జట్టు చేతిలో ముంబై ఓటమి పాలయింది. డీప్ లో ఫీల్డింగ్ చేయాలంటూ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను హార్దిక్ ఆదేశించడం రోహిత్ అభిమానులకు నచ్చలేదు. సోషల్ మీడియాలో వారు హార్దిక్ పాండ్యాను ఓ ఆట ఆడుకుంటున్నారు.

Also Read: రెచ్చిపోయిన హర్షిత్ రాణా.. ఫైన్ వేసిన ఐపీఎల్ బోర్డ్

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్లు గుజరాత్ ను 168 పరుగులకే కట్టడి చేశారు. అయితే టార్గెట్ ను ఛేదించడంలో ముంబై విఫలమయింది. ఈ నేపథ్యంలో హార్దిక్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించారు.

Also Read: నేటి నుంచి ఐపీఎల్‌ సందడి షురూ!

పవర్ ప్లేలో హార్దిక్ రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం ఒక మిస్టేక్ అని ఇర్ఫాన్ అన్నారు. ఛేజింగ్ సమయంలో తన కంటే ముందు టిమ్ డేవిడ్ ను బ్యాటింగ్ కు పంపించడం మరో మిస్టేక్ అని చెప్పారు. స్పిన్నర్ రషీద్ ఖాన్ కు మరో ఓవర్ ఉన్న సమయంలో డేవిడ్ ను పంపించడం తప్పిదమని అన్నారు. చాలా కాలంగా హార్దిక్ క్రికెట్ ఆడకపోవడం వల్ల… రషీద్ బౌలింగ్ ను ఎదుర్కోకూడదనే భావనలో హార్దిక్ ఉన్నట్టు తనకు అనిపించిందని చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో అనుభవం ఉన్న హార్దిక్ ఎంతో ఒత్తిడి ఉన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని…. విదేశానికి చెందిన బ్యాట్స్ మెన్ ను బ్యాటింగ్ కు పంపించడంలో తనకు ఎలాంటి లాజిక్ కనిపించడం లేదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button