తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL 2024: ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) ఆట‌గాడు దినేష్ కార్తీక్ తాజాగా ఐపీఎల్ లో అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. డెత్ ఓవ‌ర్ల (17-20) లో అత్య‌ధిక స్ట్రైక్ రేట్ క‌లిగిన బ్యాట‌ర్‌గా అవ‌త‌రించాడు. అలాగే డెత్ ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక ర‌న్స్ చేసిన రెండో బ్యాట‌ర్ కూడా దినేష్ కార్తీకే. 2022 నుంచి ఐపీఎల్‌లో న‌మోదైన గ‌ణాంకాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించ‌డం జ‌రిగింది.

Also Read: గుజరాత్‌తో ముంబై ఓటమి… హార్ధిక్‌పై విమర్శలు

డెత్ ఓవ‌ర్ల‌లో అత‌ని స్ట్రైక్ రేట్ ఏకంగా 280 గా ఉంది. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు డెత్ ఓవ‌ర్ల‌లో 372 ప‌రుగులు చేశాడు. ఇక అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో దినేష్ కార్తీక్ కంటే ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ షిమ్రాన్ హెట్మేయ‌ర్ ఉన్నారు. అత‌డు 383 ప‌రుగులు (స్ట్రైక్ రేట్‌- 197.42) చేశాడు. ఇక ఈ జాబితాలో ఉన్న టాప్‌-5 ఆగ‌ట‌గాళ్ల‌లో మిగ‌తా ముగ్గురు వ‌చ్చేసి కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చెందిన రింకూ సింగ్ (351 ప‌రుగులు, 195 స్ట్రైక్ రేట్‌), ముంబై ఇండియ‌న్స్ ప్లేయ‌ర్‌ టీమ్ డేవిడ్ (290 ప‌రుగులు, 207.14స్ట్రైక్ రేట్‌), గుజ‌రాత్ టైటాన్స్ ఆట‌గాడు డేవిడ్ మిల్ల‌ర్ (285 ప‌రుగులు, 161.01 స్ట్రైక్ రేట్‌) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button