తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: ఓటమి భయంతోనే కుప్పం పర్యటన..చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదా?

ధన బలం, దౌర్జన్యాలు, అక్రమ ఓటర్లతో ముప్పై ఏళ్లకు పైగా కుప్పాన్ని గుప్పిట్లో పెట్టుకున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి అక్కడి ప్రజలు బై బై చెప్పనున్నారు. మూడు దశాబ్దాల అనైతిక రాజకీయాలపై తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు పట్టం కట్టేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా, కుప్పం పర్యటనలో బాబుపై అక్కడి ప్రజలు ఏం చేశారని నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: మహిళకు మకుటం.. ఇది జగనన్న విజయం!

పదే పదే కుప్పం వస్తున్న బాబు..

చంద్రబాబు ఓటమి భయంతోనే కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల పర్యటనలు చేస్తున్న సమయంలో చంద్రబాబు ఓటమి భయంతో కుప్పం పర్యటన చేపట్టారన్నారు. చంద్రబాబు ఇక గెలవరనే విషయం కుప్పం ప్రజలందరికీ తెలుసని… తాము కూడా చంద్రబాబుకు గెలిచే పరిస్థితి లేకుండా చేస్తామని అక్కడి ప్రజలు అంటున్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు పదే పదే కుప్పం వస్తున్నారని, చంద్రబాబుకు కుప్పంలో కనీసం ఇళ్లు , ఓటు కూడా లేదని, ఈసారి ఓటమి ఖాయమని వైసీపీ నేతలు అంటున్నారు.

ALSO READ: ప్రజాక్షేత్రంలోనే జననేత..రేపటినుంచి హోరెత్తనున్న ప్రచారం

చంద్రబాబు ఏం చేశారు?

30 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ, 14ఏళ్ల పాటు సీఎంగా ఉండి కూడా చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఎప్పటికీ మారుమూల పంచాయతీగానే ఉంచాలని భావించారు. తన ‘వర్గ’ ప్రయోజనాలు తప్పించి ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత కుప్పంకు మున్సిపాలిటీ హోదా ఇచ్చారు. రోడ్లు, మంచినీటి పైపుల ఏర్పాటు వంటి కనీస మౌలిక సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. దీంతో రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఓటమి చెందుతారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button