తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Mumbai: అరుదైన ఘనత సాధించిన ‘ముంబై’

దేశ ఆర్థిక రాజధాని ముంబై మరో అరుదైన ఘనత సాధించింది. ఆసియాలోనే అత్యధిక మంది కుబేరులను కలిగి ఉన్న మూడో నగరంగా చోటు సంపాదించింది. చైనా రాజధాని బీజింగ్‌‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఘనతను సాధించింది. ఈ మేరకు హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ సంస్థ తాజాగా తన నివేదికను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో న్యూయార్క్‌ (119 మంది) అగ్ర స్థానంలో ఉండగా.. లండన్‌ (97) రెండో స్థానం ఉంది.

ALSO READ: ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ అరుదైన రికార్డు

2024 ఏడాదికి గానూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది శ్రీమంతులు నివాసముంటున్న నగరాల జాబితాను హురున్‌ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉన్నారు. అయితే, దేశాల వారీగా చూస్తే మాత్రం చైనా ఈ జాబితా ప్రథమ స్థానంలో ఉంది. గత ఏడాది కాలంలో అక్కడ 155 మంది కోటీశ్వరులు తమ సంపదను భారీగా కోల్పోయినా.. ఇంకా 814 మంది బిలియనీర్లతో మొదటి స్థానంలో నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button