తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Vishwak Sen: వేరే లెవల్… ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ నుంచి ఐటెంసాంగ్ రిలీజ్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గామి’ సినిమా తర్వాత.. ప్రస్తుతం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ తో బిజీగా ఉన్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి కీలక పాత్ర పోషించనుంది. షికర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ తాప్సీ?

విశ్వక్ సేన్ మాస్, రస్టిక్ రోల్‌లో కనిపించనున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా.. ‘సుట్టంలా చూసి పోకల’ సాంగ్‌కు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘మోత మోగిపోద్ది..’ అంటూ సాగే మాస్ ఐటెం సాంగ్‌ను రిలీజ్ చెయ్యగా.. ఇందులో విశ్వక్‌తో అయేషా ఖాన్ స్టెప్పులేసింది.

Also Read:  ఫ్యామిలీ స్టార్ నుంచి మరో అప్డేట్.. మూవీ నుంచి ఇంకో సాంగ్ రిలీజ్

ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాలో ప్రియదర్శి సరసన చేసిన అయేషాఖాన్ ఆ సినిమాతో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మోత మోగిపోద్ది అంటూ మరోసారి కుర్రాళ్ళ గుండెల్లో తన అందాలతో మోత మోగించేస్తుంది. మీరు కూడా వినేయండి ఈ స్పెషల్ సాంగ్ ని. చంద్రబోస్ రాసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వేరే లెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button