తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: టీడీపీలో అసమ్మతి సెగలు..టికెట్‌ దక్కలేదని కన్నీళ్లు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజు రోజుకు అనూహ్యంగా మారుతున్నాయి. టికెట్‌ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తాజాగా, తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్‌ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్‌ దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ALSO READ:  వైసీపీ ఎన్నికల ప్రచార భేరి.. రాష్ట్రంలో 27నుంచి నయాజోష్

చంద్రబాబు తీరని అన్యాయం..

టీడీపీని నమ్ముకున్న తనకు అధినేత చంద్రబాబు తీరని అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమన్నారు. కూటమి పేరుతో వైసీపీ నుంచి టీడీపీ చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. పైగా వారికి సపోర్టు చేయాలని చెబుతున్నారని, ఒక వేళ నేను అందుకు ఒప్పుకున్నా.. తన కేడర్ ఒప్పుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వారికి టికెట్‌ కేటాయిస్తే ప్రజలు అంగీకరించడం లేదని, తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేశారు.

ALSO READ: అగ్రవర్ణాలకే సీట్లు..నమ్మకస్తులకు పవన్ వెన్నుపోటు!

సర్వేలు ఏమయ్యాయి..?

చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రశ్నించారు. తిరుపతి టికెట్‌పై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న చెప్పారు. కాగా, ఇటీవల టికెట్ ఆశించి భంగపడిన నేతలు తమ పార్టీలపైనే తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. మరికొందరు ఫ్లెక్సీలు తరగబెడుతూ అధినేతలకు వ్యతికేకంగా నినాదాలు చేస్తూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button