తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: వైసీపీ ఎన్నికల ప్రచార భేరి.. రాష్ట్రంలో 27నుంచి నయాజోష్

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుండగా.. మరోవైపు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సీట్ల సర్దుబాట్లు, అభ్యర్థుల ఎంపికలో తర్జన భర్జన పడుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించని వైసీపీ అధినేత వైఎస్ జగన్.. మరోసారి అధికారమే లక్ష్యంగా జనంలోకి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో భారీగా జనసమీకరణ చేసి జనంలోకి దూసుకెళ్లిన వైసీపీ.. తాజాగా బస్సు యాత్రకు సిద్ధమైంది. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఈ నెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు.

ALSO READ: పిఠాపురంలో పవన్‌ను ఓడించేందుకు ముద్రగడ భారీ స్కెచ్!

21 రోజులు బస్సు యాత్ర

దాదాపు 21 రోజులపాటు జరిగే బస్సు యాత్ర.. తొలి విడత ప్రచారాన్ని రాయలసీమలో ప్రారంభించనున్నారు. బస్సుయాత్ర ప్రారంభానికి ముందు సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి మహానేత దివంగత వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో యాత్ర సాగి, ప్రొద్దుటూరులో ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల తర్వాత వివిధ వర్గాలతో జగన్ మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రజలనుంచి సూచనలు, సలహాలు వైఎస్ జగన్ స్వీకరించి తన విజన్ చెప్పనున్నారు. ఆ తర్వాత సభ జరిగే అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకోనున్నారు. పాదయాత్ర మాదిరిగా జగన్ ఈ యాత్రను కొనసాగించునున్నట్లు ఆ పార్టీ అధిష్టానం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ALSO READ: బయటపడిన చంద్రబాబు భారీ కుట్ర!

పూర్తిగా ప్రజలతోనే మమేకం

బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ఈ బస్సు యాత్రలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రసంగాలు ఉండనున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో పాటు చేసిన మంచిని వివరించనున్నారు. కాగా, ఒకే రోజు 175 శాసనసభ, 24 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. అందులో వంద స్థానాలు అంటే 50 శాతం స్థానాలను బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు ఇవ్వడంతో ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు మిన్నంటిన సంగతి తెలిసిందే.

15 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button