తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: బయటపడిన చంద్రబాబు భారీ కుట్ర!

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ భారీ కుట్రకు తెరలేపారు. చంద్రబాబు తాను బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు స్పష్టమైపోయింది. ఆయన రాజకీయ జిత్తులమారి తెలివితేటలు మరోసారి బయటపడ్డాయి. ఓ వైపు పొత్తు పేరుతో చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతూనే.. మరోవైపు ఆ పార్టీని తడిగుడ్డతో గొంతు కోసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనికి ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే) కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మోదీపై తాజాగా ఆర్కే చేసిన విమర్శల దాడిని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ALSO READ: ధనబలం ఉంటేనే టీడీపీ టిక్కెట్లు..!

మోదీపై ఘాటు విమర్శల వెనుక అసలు కథ అదే..

‘ఏబీఎన్’లో ‘మోదీ వేటకు విలవిల!’ అన్న శీర్షికన రాధాకృష్ణ తాజాగా రాసిన వ్యాసాన్ని పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. ఇందులో రాధాకృష్ణ ప్రధాని నరేంద్ర మోదీ మీద, బీజేపీ మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీకి ఎదురు వెళ్లే నేతల్ని, పార్టీలను మోదీ నామరూపాల్లేకుండా చేస్తున్నారని, అందులో భాగమే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, జాతీయ రాజకీయాలని తహతహలాడిన కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టు, పశ్చిమ బెంగాల్‌లో ఈడీ దాడులు.. ఇంకా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొని, అధికారానికి దూరం అయ్యారని, దాంతో జగన్ చేతికి అధికారం చిక్కిందని రాసుకొచ్చారు.

అంతేకాదు, ప్రధాని మోదీ ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్థలకు చెందిన అధికారులను స్వార్థపూరితంగా ప్రాంతీయ పార్టీల పైకి ఉసిగొల్పారని, ఫలితంగా అనేక మంది నాయకులు కేసుల్లో ఇరుక్కున్నారన్నారు. ‘మాయాబజార్‌’ సినిమాలో ఘటోత్కచుడి సైన్యం ‘కోర్‌ కోర్‌ శరణు కోర్‌’ అని ప్రత్యర్థులను వేటాడినట్టుగా ఇప్పుడు మోదీ రాజకీయ ప్రత్యర్థుల నుంచి ఇదే ఆశిస్తున్నారని విమర్శించారు. శరణు కోరిన వారు మాత్రమే రాజకీయాల్లో మనగలుగుతున్నారని చెప్పారు. ఢిల్లీ కేంద్రంగా 2011లో అన్నా హజారేతో కలసి చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం ఫలితంగా 2014లో యూపీఏ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అప్పటి వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి అవినీతి వ్యతిరేక ఉద్యమ ఫలితాలను తనకు అనుకూలంగా మలచుకొని ప్రధానమంత్రి అయ్యారు. అప్పట్లో తాము ఒక రాజకీయ పెను భూతానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విషయం కేజ్రీవాల్‌కు గానీ, కాంగ్రెస్‌ పార్టీతో విభేదించిన ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులకు గానీ తెలియలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: ఏపీలో మరోసారి వైసీపీదే అధికారం!

బీజేపీని లేకుండా చేయడమే బాబు లక్ష్యమా?

అయితే.. ఈ వ్యాసాన్ని, దీని సారాంశాన్ని నిశితంగా గమనిస్తే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా టీడీపీ, చంద్రబాబుల జపం చేసే ‘ఎబీఎన్’, ఆర్కేలు… టీడీపీ, బీజేపీ కూటమి తర్వాత కూడా ఇలాంటి వ్యాసం రాయడాన్ని బట్టి ఇది కచ్చితంగా చంద్రబాబు స్కెచే అని తెలుస్తోంది. బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజల్లో ఆర్కే వ్యాసాల ద్వారా ఒక ప్రతికూల వాతావరణాన్ని కావాలనే సృష్టిస్తున్నారు. అదే సమయంలో మళ్లీ టీడీపీ నాయకులకు బీజేపీకి సపోర్ట్ చేయమని చంద్రబాబే చెబుతున్నారు. అంటే ముందు తామే తిట్టి మళ్లీ పొత్తు ద్వారా రాజకీయ రక్షణ పొందేందుకు తామే పొగడటం అన్న మాట. ఈ ఎన్నికల్లో ఒకవేళ ఎలాగోల గట్కెక్కితే ఇక చంద్రబాబు దెబ్బకు బీజేపీ కథ ముగిసినట్లే అన్నమాట. ఈ విషయం కేంద్రంలోని, రాష్ట్రంలోని కమలనాథులు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button