తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: ధనబలం ఉంటేనే టీడీపీ టిక్కెట్లు..!

టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజాస్వామ్యం అంటే ధనస్వామ్యం అనేలా ప్రవర్తిస్తున్నారు. ధనబలం ఉన్నవారికే ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయిస్తూ రాజకీయాలంటే కేవలం డబ్బున్నవారికే సొంతమని కొత్త అర్థం చెబుతున్నారు. టీడీపీ ఇప్పటి దాకా ప్రకటించిన మూడు జాబితాలను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా తేలికగానే అర్థమవుతుంది. నిన్న విడుదలైన టీడీపీ మూడో జాబితాలో ఈ విషయం మరింత స్పష్టంగా తేటతెల్లమైంది. విజయవాడ, గుంటూరు ఎంపీ స్థానాలను అనుకున్నట్లుగానే ధనబలం ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఎన్‌ఆర్‌ఐ పెమ్మసాని చంద్రశేఖర్‌కి కేటాయించారు.

దేవినేనిని కాదని కృష్ణప్రసాద్‌కి టిక్కెట్

పెనమలూరు, మైలవరం నియోజక వర్గాలకు అభ్యర్థుల ఎంపికలోనూ చంద్రబాబు ధన రాజకీయం బయటపడింది. ఈ స్థానాలను బోడె ప్రసాద్, వసంత కృష్ణప్రసాద్‌ పేర్లను ఖరారు చేశారు. అయితే మైలవరం సీటు కోసం ఫిరాయింపు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారా­వులు గట్టిగా పోటీపడ్డారు. కానీ సీనియర్ నేత దేవినేని ఉమాను కాదని ఇటీవలే టీడీపీలో చేరిన కృష్ణప్రసాద్‌ ధనబలంతో దాన్ని చేజిక్కించుకున్నట్లు సమాచారం.

ALSO READ: టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఆలపాటి..!

ఇక, నరసరావుపేట, నెల్లూరు స్థానాలను సైతం ఫిరాయింపు నేతలు, పైగా ధనబలం పుష్కలంగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కట్టబెట్టారు. దీన్ని బట్టి చంద్రబాబు ‘ధన’ రాజకీయాలను అర్థంచేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలని తహతహలాడుతున్న ఆయన.. భారీగా డబ్బులు పంచి, అధికారం చేపట్టాన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button