తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Razakar Movie: ‘రజాకార్’ నిర్మాతకు బెదిరింపు కాల్స్..హై సెక్యూరిటీ

రజాకార్‌ సినిమా నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదలకు సిద్ధమైనా ఈ సినిమా.. అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే నిర్మాతకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరించారు. తనకు 1100 బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు..

తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంలో సాగే చారిత్రక కథాంశంతో రూపొందిన సినిమా రజాకార్‌. రాజకీయంగా ఎన్నో వివాదాలకు కేంద్రంగా నిలిచిన రజాకార్‌ మూవీ..సైలెంట్‌ జినొసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ సినిమా అనేక అడ్డంకులను దాటుకొని మార్చి 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది. నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లనే రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ, ఇంద్రజ కీలక పాత్రల్లో నటించారు.

కమర్షియల్‌ సినిమా కాదు.. అది మన చరిత్ర

ఈ సందర్భంగా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రజాకార్‌ అనే చిత్రం కమర్షియల్‌ సినిమా కాదని ఇది మన చరిత్రను తెలియజేసే చిత్రమని పేర్కొన్నారు. ఆ రోజుల్లో హిందువులపై రజాకార్లు చేసిన దాడులు, ఆకృత్యాలు, మత మార్పిడులు జరిగిన తీరు నేటి తరం యువత తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమని పేర్కొన్నారు. భవిష్యత్‌ తరాలు కూడా ఈ చిత్రం ఒక పుస్తకంలా ఉపయోగపడుతుందన్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మరో నలుగురి తీసుకెళ్లి మన తాతలు, ముత్తాతలు పడిన బాధలను చూపించాలని కోరారు. రజాకార్లు అంటే ఎవరో తెలియని వారు, నేటి తరం యువత తప్పక చూడాల్సిన చిత్రమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button