తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెలుగులోకి వచ్చిన టీడీపీ, జనసేనల స్కాం..!

ఎలక్టోరల్ బాండ్ల రూపంలో టీడీపీ, జనసేన పార్టీలు చేసిన స్కాం బయటపడింది. సుప్రీంకోర్టుకు ఎస్‌బీఐ తాజాగా అందించిన ఎన్నికల బాండ్ల వివరాల్లో ఈ రెండు పార్టీలకు పలు సంస్థల నుంచి భారీగా విరాళాలు అందినట్లు వెల్లడైంది. ఈ విరాళాలు పొందడంలో జనసేన టీడీపీతో పోటీ పడిందనే చెప్పాలి. టీడీపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీల్లో షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ రూ.40 కోట్లు, మేఘా ఇంజనీరింగ్‌ రూ. 28 కోట్లతో రెండో స్థానంలో నిలిచాయి. యూపీ పవర్‌ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.20 కోట్లు, నాక్టో ఫార్మా లిమిటెడ్‌ రూ.14 కోట్లు, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.13 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్​ లిమిటెడ్‌ రూ.10 కోట్ల ఎన్నికల బాండ్లు టీడీపీకి విరాళంగా ఇచ్చిన వాళ్లలో ఉన్నారు. ఇక ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ చైతన్య స్టూడెంట్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ తరఫున జనసేనకు రూ. కోటి విరాళం అందగా, టీడీపీకి రూ. 5 కోట్లు అందడం గమనార్హం.

ALSO READ: విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులు TDP, BJP నేతల కుటుంబీకులే!

శ్రీ చైతన్య విద్యాసంస్థల భారీ కుట్ర

శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం టీడీపీ, జనసేలకు భారీగా విరాళాలు ఇవ్వడం వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే నాడు-నేడు పథకం కింద పాఠశాలల రూపురేఖలను సమూలంగా మార్చారు. కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా వసతులు కల్పించారు. పిల్లల చదువుకు కావాల్సిన వస్తువులను విద్యాకానుక పేరుతో అందిస్తున్నారు. పిల్లలు చదువులో రాణించాలంటే ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో జగనన్న ‘గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారం అందిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేట్ సంస్థలకు భారీగా గండి పడింది. శ్రీచైతన్య వంటి విద్యాసంస్థలకు భారీగా అడ్మిషన్లు తగ్గిపోయాయి. దీంతో రానున్న ఎన్నికల్లో ఎలాగైనా కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఆయా సంస్థలు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే రెండు పార్టీలకు భారీగా నిధులను అందజేసినట్లు సమాచారం. అంతేకాదు, ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే నాడు-నేడు పథకాన్ని సమూలంగా తడిచివేయాలని ఈ పార్టీలతో ఆయా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది.

ALSO READ: ప్రశ్నార్థకంగా జనసేన ఉనికి.. త్వరలో బీజేపీలో విలీనం?

రెండు నెలల్లోనే భారీగా విరాళాలు

కేవలం అక్టోబర్‌ 2023 నుంచి ఫిబ్రవరి మధ్యలోనే రూ. 130 కోట్లను టీడీపీ విరాళంగా స్వీకరించింది. మొత్తంగా టీడీపీకి ఎన్నికల బాండ్ల రూపేణా వచ్చిన రూ. 212 కోట్లలో 55 శాతం ఫండింగ్‌.. అంటే సుమారు రూ. 118 కోట్లు కేవలం ఒక్క జనవరిలోనే అందడం గమనార్హం. ఇక పెద్దగా గుర్తింపు లేని జనసేన పార్టీకి సైతం ఎన్నికల వేళ భారీగా విరాళాలు అందడం గమనార్హం. 2022 జనసేనకు రూ.22 కోట్లు, 2023లో మరో రెండు కోట్లు, 2024లో ఏకంగా 17 కోట్ల రూపాయలు.. మొత్తంగా 21 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button