తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Janasena: ప్రశ్నార్థకంగా జనసేన ఉనికి.. త్వరలో బీజేపీలో విలీనం?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా పతనావస్థకు చేరుకుంటున్నారా? రాజకీయంగా ఆయన సొంతంగా నిలదొక్కుకోలేక పోతున్నారా? ఆయన వ్యాఖ్యలు జనసేన ఉనికికే పెను ప్రమాదకరంగా మారనున్నాయా? అంటే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. తీవ్ర గందరగోళంలో ఉన్న పవన్ కళ్యాణ్ మైకు ముందు ఏం మాట్లాడుతున్నారో, మీడియా ముందు ఏం చెబుతున్నారో జనసేన పార్టీ నేతలకే అంతు చిక్కడం లేదట.

ALSO READ: మరోసారి అధికారం.. 49.14శాతం వైసీపీ వైపే మొగ్గు!

MLAగానా? MPగానా? పోటీపై రాని స్పష్టత

జనసేన పార్టీని ఏర్పాటు చేసి పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయంపై స్పష్టత లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ పెట్టి ప‌దేళ్ల త‌ర్వాత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడ‌మా, లేదా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయ‌డ‌మా? అనేది అమిత్ షా నిర్ణయిస్తారని స్వ‌యంగా చెప్పుకోవ‌డం ఆయ‌న రాజ‌కీయ ప‌త‌నావ‌స్థ‌లో పీక్స్ అనుకోవ‌చ్చు. తాను స్వ‌యంగా ఎక్క‌డ పోటీ చేయాలో కూడా వేరే పార్టీ వాళ్ల ఆదేశాల కోసం వేచి చూడాల్సి రావ‌డం జనసేన ఉనికికే ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

ALSO READ: చంద్రబాబు స్కాంల మీద 250 పేజీల పుస్తకం..స్కిల్ బిల్ పాండే!

విలీనం దిశగా అడుగులు

పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా సొంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేదని ఆయన వ్యాఖ్యలు తాజాగా మరోసారి నిరూపించాయి. గతంలోనే కూటమి ఏర్పాటు సమయంలో ఆయనే మాట్లాడుతూ తమకు సొంతంగా బలం, బలగం లేదని ఒప్పుకున్నారు. ఇప్పుడు అవే మాటలు నిజం చేస్తున్నారు. జ‌న‌సేన ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాల‌నేది టీడీపీ అధినేత చంద్ర‌బాబు చెబుతారు. ఇక పవన్ ఎక్కడ పోటీ చేయాలనేది బీజేపీ డిసైడ్ చేస్తుంది. మరి అలాంటప్పుడు సొంతంగా పార్టీని పెట్టడం దేనికి? టీడీపీలోనో లేదా బీజేపీలోనో ఆయన పార్టీని విలీనం చేయడమో చేయొచ్చు కదా అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

చిరంజీవి దారిలోనే పవన్.. జూలై 18 లేదా 20న బీజేపీలో జనసేన విలీనం?

ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి నడిచిన దారిలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా ఎంతో ఆర్భాటంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, దానిని చివరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా జూలై 18 లేదా 20 తేదీల్లో జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే సూచనలు కనిపిస్తున్నాయని అంతర్గత వర్గాల సమాచారం. పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా, లేదా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనకు రాజ్యసభ సీటు అవకాశం ఇస్తుందని, ఇక పవన్ తన పార్టీలోని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button