తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Devara: దేవర మూవీ వీడియో లీక్.. ఫైర్ అవుతున్న మేకర్స్

కొరటాల శివ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. రెండు పార్టులుగా వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్ సినిమాపై మంచి హైప్స్ ను పెంచేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీకైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also read: Suhas: సుహాస్ కు బంపర్ ఆఫర్.. మహానటితో సినిమాలో ఛాన్స్

ఇందులో తారక్ బ్లాక్ షర్ట్, లుంగీ కట్టుకొని బీచ్ నుంచి అలా నడుచుకొని బయటికి వస్తున్నారు. ఇది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతుంటే మేకర్స్ మాత్రం వీడియో లీక్ పై మండిపడుతున్నారు. దేవర టీమ్ ప్రస్తుతం గోవాలో షూటింగ్ చేస్తుంది. ఈ సందర్భంగా దేవర సెట్‌ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ వీడియో ఒకటి లీకైంది. ఎవరో దీన్ని దూరం నుంచి ఫోన్‌లో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button