తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: మరోసారి అధికారం.. 49.14శాతం వైసీపీ వైపే మొగ్గు!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే పలు సర్వేలు వైసీపీకే మెజార్టీ సీట్లు వస్తాయని ఫలితాలను వెల్లడించాయి. తాజాగా, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలపై ఏఐ సంచలన అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంచనాల్లో వైసీపీ మరోసారి అధికారం చేపట్టనుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఓట్ షేర్ విషయానికొస్తే 49.14శాతం అధికార పార్టీపై మొగ్గు చూపారని తెలిపింది. కాగా, సీఎం జగన్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ కో-పైలెట్‌ అంచనా వేసింది.

ALSO READ: టార్గెట్ ‘పవన్’.. కాపు ముఖ్యనేతలతో ప్రచారం!

49.14శాతం వైసీపీ వైపే మొగ్గు

టైమ్స్ నౌ -ఈటీజీ సంస్థలకు దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నో ఎన్నికల్లో సర్వేలు చేసిన అనుభవం ఉంది. ఈ సంస్థలు వెల్లడించిన పలు సర్వేల అంచనాలకు తగినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి. తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేల్లో వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని వెల్లడైంది. ఈ సర్వేల్లో ఏపీలో 49.14శాతం ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టం అయింది. మొత్తం 25 సీట్లలో వైసీపీ 21 నుంచి 22 స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

ALSO READ: టీడీపీ, జనసేన ప్లాన్ ఫెయిల్.. షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్‌

వైసీపీకి 121 స్థానాలు..

పొలిటికల్‌ క్రిటిక్‌ సర్వేలో మొత్తం 175 సీట్లలో 121 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఈ సర్వేను ఈటీజీ.. 2023 డిసెంబర్‌ 13వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు నిర్వహించగా.. సుమారు 3లక్షల 20 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో 85శాతం క్షేత్రస్థాయిలో.. 15శాతం ఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వేలో వైసీపీ, 49.5 శాతం, టీడీపీ-జనసేన-బీజేపీ 43 శాతం కాంగ్రెస్ 2.5 శాతం, ఇతరులు 5 శాతం వరకు వచ్చే అవకాశం ఉందని తేలింది.

22 Comments

  1. జై జగనన్న జై జగన్ అన్న జై జై జగన్ అన్నా వైఎస్ఆర్సీపీ

  2. జై జై జగన్ మోహన్ రెడ్డి
    జై జై వై యస్ ఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button