తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: టీడీపీ, జనసేన ప్లాన్ ఫెయిల్.. షాక్ ఇచ్చిన ఎన్నికల కమిషన్‌

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మధ్య జరిగిన తొలి సభ అట్టర్ ప్లాప్ అయింది. మొదట ప్రధాని ప్రసంగించే సమ­యంలో మైకులు మూడు సార్లు మూగబోయా­యి. అంతకుముందు కొంతమంది కార్యకర్తలు సౌండ్‌ బాక్స్‌లు, ఫ్లడ్‌ లైట్ల టవర్ల పైకి ఎక్కారు. అది ప్రమాదమని తెలిసినా.., చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ వారిని వారించలేదు. దీంతో ప్రధా­నే స్వయంగా పవన్‌ను ప్రసంగం ఆపమని చెప్పి, తాను మైకు ముందుకు వచ్చి వారందరినీ కిందికి దిగాలని కోరాల్సివచ్చింది. ఇలా టీడీపీ కూటమి లోపాలు స్పష్టంగా కనపడుతున్నా.. ఆ లోపాలను పోలీసులు, అధికారులపైనా నెట్టేందుకు టీడీపీ, జనసేన నాయకులు పూనుకుని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా మోదీ సభ ఫెయిల్యూర్‌పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్‌ ఇచ్చింది.

ALSO READ: గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో సభ.. రాష్ట్రమంతా ‘బస్సు యాత్ర’

పరిధిలో లేని అంశంపై ఫిర్యాదు..

ప్రధాని మోదీ సభ ఫెయిల్యూర్‌ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన చేసిన ప్లాన్ ఫెయిల్ అయింది. బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే టీడీపీ, జనసేన బండారం.. సీఈఓ ముఖేష్‌ కుమార్‌ మీనా సమాధానంతో బట్టబయలైంది. తమ పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని పేర్కొనడంతో తెల్లముఖాలు వెేసుకున్నారు. ‘ప్రధాని సభ భద్రత కేంద్ర హోంశాఖ, ఎస్ పీజీ పరిధిలో ఉంటాయి. ప్రధాని పర్యటన భద్రత అంతా హోం శాఖనే చూస్తుంది. ఎన్నికల కమిషన్‌కు ఇందులో ఎటువంటి పాత్ర ఉండదు. నాకు ఫిర్యాదు చేసినా నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.

ALSO READ: జనసేన పార్టీకి బిగ్ షాక్‌.. పార్టీని వీడుతున్న కీలకనేతలు!

అనుమతి కోరలేదు..

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా టీజర్‌ మంగళవారం రిలీజైంది. ఇందులో గ్లాస్‌ అంటే సైన్యం అంటూ సినిమాతో సంబంధం లేని డైలాగులు పలికాడని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఈ రకంగా గ్లాస్‌ గురించి ప్రచారం చేసుకోవచ్చా? అంటూ వైసీపీ నుంచి ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా, ఈ వార్తలపై ఈసీ స్పందించింది. ఎవరు ఏ గుర్తయినా ప్రచారం చేసుకోవచ్చు కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయని తెలిపింది. పవన్‌ కల్యాణ్‌ సినిమా టీజర్‌ను చూడలేదని, గాజు గుర్తు ప్రచారం చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. పవన్‌ కల్యాణ్‌ అయితే ఎటువంటి అనుమతి కోరలేదని, ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఏపీ ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button