తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Dhanush: ఇళయరాజా బయోపిక్… హీరోగా ధనుష్

ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్న‌ట్లు గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఇళయరాజా జీవితచరిత్ర ఆధారంగా వ‌స్తున్న ఈ చిత్రంలో ధనుష్‌ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘కెప్టెన్ మిల్లర్’ ద‌ర్శ‌కుడు అరుణ్ మాథేశ్వరన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

Also Read: ‘ఆయ్’ మూవీ నుంచి ‘సూఫీయానా.. గుండెల్లోనా’ మెలోడీ సాంగ్ రిలీజ్

2024లో షూటింగ్‌ మొదలుపెట్టి.. 2025లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా ఇళయరాజా మోష‌న్ పోస్ట‌ర్‌ను ధ‌నుష్ ఎక్స్ వేదిక‌గా పంచుకున్నాడు. ఇక ఈ పోస్ట‌ర్‌లో సంగీత దర్శకుడు అవుదామ‌ని మ‌ద్రాస్ న‌గరం కు వచ్చిన ఇళయరాజా పాత్ర‌ను చూడ‌వ‌చ్చు.

Also Read: పవర్ ఫుట్ డైలాగ్స్ తో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్.. మూవీ గ్లింప్స్ ఔట్

47 ఏళ్లుగా తన సంగీతంతో సినీ ప్రేక్షకులను, శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఇళయరాజా .. ఇప్పటివరకు సుమారుగా 1400కు పైగా చిత్రాల్లో ఏడు వేలకుపైగా పాటలకు సంగీతం అందించారు. అనేక అవార్డులు, రివార్డులు పొందారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే పౌర పురస్కారాలైన ‘పద్మ భూషణ్‌’, ‘పద్మ విభూషణ్‌’ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button