తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: టార్గెట్ బీఆర్ఎస్ … వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్

రాజకీయాల్లో హిస్టరీని రిపీట్ చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తుంది. గతంలో సీఎల్పీని విలీనం చేసుకుని కాంగ్రెస్‌ను వీక్ చేసిన కేసీఆర్‌ను.. అదే ఫార్ములా ఉపయోగించి దెబ్బకొట్టేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలో ఉండటంతో గులాబీ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించి చర్చలు సైతం కొనసాగిస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసుకుని రాజకీయంగా గులాబీ బాస్‌ను పూర్తిగా బలహీన పర్చేందుకు అధికార పార్టీ అడుగులు వేస్తుంది.

Also Read: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. అభిషేక్ బోయినపల్లికి బెయిల్

తెలంగాణ రాష్ట్రంలో మే 13న లోకసభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అంతలోపే బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో గులాబీ పార్టీకి క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు లీడర్లు లేకుండా చేయడమే హస్తం పార్టీ ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో గులాబీ పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో మెజార్టీ శాసనసభ్యులు హస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Also Read:  బీజేపీలో చేరిన మాజీ గవర్నర్… ప్రత్యేక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ

కాంగ్రెస్‌లో చేరేందుకు సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్టు హస్తం పార్టీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరబోయే ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంతనాలు జరుపుతున్నట్టు టాక్. ముందుగా గ్రేటర్ హైదారాబాద్ ఎమ్మెల్యేలను చేర్చుకుని, ఆ తర్వాత మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దశలవారీగా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న తర్వాత లోక్‌సభ ఎన్నికల లోపు ఎల్పీ విలీనం పూర్తి చేయాలని హస్తం పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button