తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Raghava Lawrence: మానవత్వం చాటుకున్న లారెన్స్.. నిరుపేద మహిళకు సాయం

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపక్క సినిమాలు చేస్తూనే.. సేవ కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. తన తల్లి పేరు మీద ఓ ఫౌండేషన్ స్థాపించి.. ఎంతో మంది చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ కూడా చేయించాడు. దీంతో ఆయన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఇలాంటి సేవ కార్యక్రమాలను చేయడానికి ముందుకు వస్తున్నారు.

Also read: Pushpa-2: పుష్ప-2 టీజర్ పై కీలక అప్డేట్.. బన్నీ బర్త్ డే గిఫ్ట్ గా రిలీజ్?

వారిలో కమెడియన్‌ కేపీవై బాల ఒకరు. తమిళంలో ప్రసారమైన ఒక కామెడి షో ద్వారా పరిచయమైన కేపీవై బాల.. ఆతరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. లారెన్స్ స్ఫూర్తితో కేపీవై బాల కూడా పలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఇటీవల అతనికి తమిళనాడులో మురుగమ్మాళ్ అనే మహిళ గురించి తెలిసింది. భర్తను కోల్పోయిన ఆమెకు తన ముగ్గురు కూతుళ్లను పోషిచడం కష్టాంగా మారింది. అందుకోసం రైల్లో సమోసాలు అమ్మేది. అయితే ఆమె దీన స్థితి గురించి తెలుసుకున్న కేపీవై బాల వెంటనే లారెన్స్ దృష్టికి తీసుకెళ్లాడు.

అది తెలుసుకున్న లారెన్స్ స్పందించి.. ఆ ఒంటరి మహిళకు అండగా నిలిచాడు. ఆమెకు ఆటో తోలడం వచ్చినా.. కొనుక్కునే ఆర్ధిక స్థోమత లేకపోడంతో లారెన్స్ దగ్గరుండి ఆమెకు కొత్త ఆటోను కొనిచ్చారు. స్వయంగా ఆ మహిళను కలిసిన లారెన్స్.. కొత్త ఆటో తాళంచెవిని ఆమెకు అందజేశాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనతో కన్నీళ్లు పెట్టుకుంది ఆ మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ లారెన్స్, కేపీవై బాల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button