తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: కడియం శ్రీహరిపై చర్యల దిశగా బీఆర్ఎస్… ఫలించేనా?

కడియం శ్రీహరి వ్యవహారంలో బీఆర్ఎస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కడియంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే గులాబీ ఎమ్మెల్యే బృందం స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి బయలుదేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు.

Also Read: ఎన్నికల కోడ్.. డీఎస్సీ పరీక్షపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరనున్నారు. స్పీకర్ అపాయింటుమెంట్ తీసుకొని అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు.

Also Read: వైసీపీకి పెరిగిన సంఖ్యాబలం..మెజారిటీ ఓటర్లు ఏమన్నారంటే?

మరోవైపు కడియం శ్రీహరి, కడియం కావ్య తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారని మీడియా వర్గాల్లో వార్త చక్కెర్లు కొడుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్‌లోని ఒక్క స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోవడం పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button