తెలుగు
te తెలుగు en English
జాతీయం

BJP: బీజేపీ 8వ జాబితా విడుదల.. 11 మందికి చోటు

లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే కేంద్ర బీజేపీ నాయకత్వం నిన్న రాత్రి 11 మంది అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఒడిశా నుండి ముగ్గురు, పంజాబ్ నుండి ఐదుగురు, పశ్చిమ బెంగాల్ నుండి ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ ఇప్పటి వరకు 411 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

ALSO READ: కడియం శ్రీహరిపై చర్యల దిశగా బీఆర్ఎస్… ఫలించేనా?

ఒడిశా నుంచి జాజ్‌పూర్ (SC): డాక్టర్ రవీంద్ర నారాయణ్ బెహెరా, కంధమాల్: సుకాంత కుమార్ పాణిగ్రాహి, కటక్: భర్తృహరి మహతాబ్; పంజాబ్ నుంచి గురుదాస్‌పూర్‌: దినేష్‌ సింగ్‌; అమృత్‌సర్‌, తరంజిత్ సింగ్ సంధు; జలంధర్: సుశీల్ కుమార్ రింకు, లూథియానా: రవ్‌నీత్ సింగ్ బిట్టు, ఫరీద్‌కోట్: హన్స్ రాజ్ హన్స్ (SC), పాటియాలా: ప్రణీత్ కౌర్; పశ్చిమ బెంగాల్ నుంచి ఝర్‌గ్రామ్ (ST): డాక్టర్ ప్రణత్ తుడు, బీర్భూమ్: దేబాశిష్ ధర్.. తదితరులు పేర్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button