తెలుగు
te తెలుగు en English
క్రికెట్

IPL-2024: నేడు గుజరాత్‌తో హైదరాబాద్‌ పోరు.. మరో విక్టరీపై గురి

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఫామ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పరుగులకుపైగా స్కోరు చేసింది. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును హైదరాబాద్ చిత్తుగా ఓడించింది. ఏకంగా 277 పరుగులు చేసి ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ జట్టు చేయలేని స్కోరు చేసి రికార్డు నెలకొల్పింది. మరోసారి తమదైన జోరు కొనసాగించేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పట్టుదలతో ఉంది.

ALSO READ: హైదరాబాద్ జట్టుకు కొత్త తలనొప్పి.. కీలక ఆటగాడి కోసం ఎదురుచూపులు

గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం తలపడనుంది. ముంబైతో మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన హెడ్‌, అభిషేక్‌శర్మ, క్లాసెన్‌ మరోమారు బ్యాటు ఝులిపిస్తే..హైదరాబాద్‌కు తిరుగుండదు. తొలి రెండు మ్యాచుల్లో ఓ విజయం సాధించిన ఇరు జట్లు నేడు రెండో విజయంపై కన్నేసి బరిలోకి దిగుతున్నాయి. ఇక, భువనేశ్వర్‌ కుమార్‌, నటరాజన్‌, షాబాజ్‌ అహ్మద్‌లు బంతితో కమిన్స్‌కు సహకరిస్తే హైదరాబాద్‌కు మరో విజయం ఖాయమే.

3 Comments

  1. My brother suggested I may like this website.
    He used to be totally right. This publish actually made my day.
    You can not consider just how much time I had spent for this info!

    Thank you!

    Look at my web blog; vpn special

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button