తెలుగు
te తెలుగు en English
జాతీయం

Delhi: నేడు ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి మహార్యాలీ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఇవాళ ఢిల్లీలో మహార్యాలీకి పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో విపక్ష ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. రాంలీలా మైదానంలో ఈ ర్యాలీ జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఇండియా కూటమి పేర్కొంది.

ALSO READ: బీజేపీ 8వ జాబితా విడుదల.. 11 మందికి చోటు

ఈ నిరసనల్లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ సహా కీలకనేతల పాల్గొంటారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎన్డీయే ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నేటి ర్యాలీలో ఇదే అంశాన్ని ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లనున్నాయి. ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌ పవార్‌ (ఎన్సీపీ–ఎస్‌సీపీ), ఆర్జేడీ నుంచి తేజస్వీ యాద‌వ్‌, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి సీతారాం ఏచూరి, డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్‌ అబ్దుల్లా, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరవుతున్నారు.

5 Comments

  1. Its like you read my mind! You appear to know a lot about this, like you wrote the book in it or something.
    I think that you can do with some pics to drive
    the message home a bit, but instead of that,
    this is great blog. An excellent read. I will certainly
    be back.

    my web blog; vpn coupon code 2024

  2. Great beat ! I wish to apprentice while you amend your website,
    how could i subscribe for a blog site? The account helped me
    a acceptable deal. I had been a little bit acquainted of this your broadcast offered bright clear idea

    Feel free to surf to my site; vpn special code

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button