తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Elections: జనసేన పార్టీకి బిగ్ షాక్‌.. పార్టీని వీడుతున్న కీలకనేతలు!

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న జనసేన పార్టీకి బిగ్ షాక్‌ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం సీనియర్ నాయకురాలు మాకినీడు శేషుకుమారి పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఈమె 2019 ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. ఈమె పార్టీ పెట్టిన దగ్గర నుంచి జనసేనలోనే ఉండడంతోపాటు పార్టీ బలోపేతానికి కష్టపడ్డారు.

ALSO READ:  గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో సభ.. రాష్ట్రమంతా ‘బస్సు యాత్ర’

జనసేనకు గుడ్‌బై..

రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జనసేన చేపట్టిన కార్యక్రమంలోనూ శేషుకుమారి చురుగ్గా పాల్గొన్నారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికై పవనన్నకు ఓటు వేసి జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, పార్టీలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో ఆమె జనసేనకు గుడ్‌బై చెప్పేశారు. అంతకుముందు ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని వదిలేయకుండా నియోజకవర్గంలో కష్టపడుతునే ఉన్నారు. 2024లో టికెట్‌ను ఆశించిన ఆమెకు మొండిచెయ్యి చూపించారు. అంతకుముందు టికెట్ విషయమై మాట్లాడాలని శేషుకుమారి ప్రయత్నాలు చేసినా ఫెయిలయ్యాయని సమాచారం. కష్టపడిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతేనే పార్టీని వీడుతున్నట్లు సమాచారం.

ALSO READ: సామాన్య కార్యకర్తలకు సీఎం జగన్ పట్టం… వాళ్లే ఆయన బలం, బలగం

జగన్ సమక్షంలో వైసీపీలోకి..

జనసేన అధినేత పవన్ ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. పార్టీలో తనకు తప్పా ఇంకెవరికీ ప్రాధాన్యత దక్కకూడదన్న ఆలోచనతో పవన్ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మాకినీడు శేషుకుమారి ఇవాళ సీఎం జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. గత కొంతకాలంగా జనసేనకు దూరంగా ఉంటున్న శేషుకుమారి.. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంపై జనసేన సైనికులు స్పందించారు. శేషుకుమారి వైసీపీలోకి వెళ్లినా.. తమ పార్టీకి నష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇప్పటికే పిఠాపురం నుంచి చాలామంది జనసేన నేతలు వైసీపీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button