తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

YSRCP: సామాన్య కార్యకర్తలకు సీఎం జగన్ పట్టం… వాళ్లే ఆయన బలం, బలగం

ఈ కాలంలో రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయి. ఓ సామాన్య కార్యకర్త పైకి ఎదగలనుకుంటే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. పార్టీ కోసం ఎంత కష్టపడిన గుర్తింపు లభించదు. మామూలుగా కార్యకర్తలను జెండాలు మోయడం, ప్రచారం చేయడానికే పార్టీ పెద్దలు వాడుకొని వదిలేస్తారు. పార్టీలో వారికంటూ సముచిత స్థానం లభించదు. కానీ వైఎస్ఆర్సీపీ అధినేత, సీఎం జగన్ అలా చేయలేదు. పార్టీని నిలబెట్టడంలో వాళ్లు పడిన శ్రమను గుర్తించిన సీఎం వారికి త్వరలో జరగబోయే ఎలక్షన్స్ లో పిలిచి మారి సీటు ఇచ్చాడు. సామాన్య కార్యకర్తలే తన బలమని జగన్ ఈ విధంగా మరోసారి నిరూపించాడు.

Also Read: పవన్ కల్యాణ్‌పై మండిపడుతున్న టీడీపీ నేతలు..!

ఈసారి జరగబోయే ఎన్నికల్లో సింగనమల ఎమ్మెల్యేగా వీరాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. ఆయన బతుకు గడవడం కోసం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తరుపున తనకు టికెట్ లభించిందని తెలిసిప్పుడు షాక్ కు గురైన ఆయన సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానంటున్నారు. మరోవైపు మడకశిర నుంచి ఈర లక్కప్ప అనే ఉపాధిహామీ కూలీని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. జగన్ తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు.

Also Read: ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి బీటలు!

పార్టీ పెద్దలు సీటుకు ఇంత అంత అని బేరం ఆడి మారి సీటు కేటాయిస్తున్న నేపథ్యంలో ఓ సామాన్య కార్యకర్తకు టికెట్ ఇవ్వడం గొప్ప విషయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని పార్టీలు అభ్యర్థికి ప్రజల్లో మంచి పేరు ఉన్న డబ్బులేదనే కారణంతో టికెట్ లేదని చెబుతున్నాయి. మరికొన్ని పార్టీలైతే సీటుకు ఇంతని అభ్యర్థి నుంచి వసూలు చేస్తున్నాయి. డబ్బు ఉంటేనే టికెట్ లేదంటే సీటు కూడా లేదని ముఖం మీదే చెబుతున్నారని ఈ మధ్య కాలంలో కొందరు ఆశావహులు ఆరోపణలు కూడా చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్త నుంచి ఏమి ఆశించకుండా టికెట్ ఇవ్వడం సీఎం జగన్ గొప్ప మనసుకు నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారు.

Also Read: చెరపకురా చెడేవు .. టీ-కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్!

చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు సాధారణ కార్యకర్తలే రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఆయనొచ్చాక ఓటుకు ఇంత అని రేటుపెట్టి మరీ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే టికెట్ కావాలంటే అతని వద్ద ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తాడు? ఎన్ని కోట్లు పార్టీకి ఇవ్వగలడు అని ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకునేవాడనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కోట్లున్నవాళ్లకే తప్ప ప్రజల్లో ఉన్నవాళ్లేవరికీ టీడీపీ టికెట్లు దక్కడంలేదు. దీంతో టీడీపీ నాయకులంతా కోటీశ్వరులే అని వేరే చెప్పక్కర్లేదు. మరి చూడాలి ప్రజలు తమ శ్రేయస్సు గురించి ఆలోచించే నాయకుడిని గెలిపిస్తారో? లేక తమ భవిష్యత్ కోసం ఆలోచించి డబ్బు వెనకేసుకునే నాయకులను గెలిపిస్తారో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button