తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

TDP: ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీకి బీటలు!

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. జనసేనతో పొత్తు కారణంగా పలువురు టీడీపీ సీనియర్ నేతలకు టిక్కెట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దశాబ్దాలుగా తాము పార్టీకి చేసిన సేవలకు గౌరవం ఇదేనా అని వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో బండారు సత్యనారాయణ కూడా ఉన్నారు. పెందుర్తి స్థానాన్ని ఆశించిన ఆయనకు భంగపాటు తప్పలేదు. పొత్తులో భాగంగా పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచి బండారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇవాళో, రేపో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

ALSO READ: ఎన్నికల ప్రచారానికి వైసీపీ సిద్ధం.. ఈనెల 27 నుంచి బస్సుయాత్ర

అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బండారు?

పెందుర్తి అసెంబ్లీ టిక్కెట్‌ను వైసీపీ ఇప్పటికే అదీప్ రాజ్‌కు కేటాయించిన నేపథ్యంలో బండారు సత్యనారాయణ పార్టీలో చేరితే ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటును కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనికి బండారు కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు తన మద్దతుదారులతో బండారు చర్చలు జరుపుతున్నారు. బండారు వంటి కీలక నేత టీడీపీని వీడితే అది ఆ పార్టీకి విశాఖ జిల్లాలో కోలుకోలేని దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన బండారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తీసుకునే ఈ నిర్ణయం ఉత్తరాంధ్రాలో టీడీపీ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.

బండారు దారిలోనే మరో ముగ్గురు టీడీపీ నేతలు!

ALSO READ: ఏపీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.. ఐదేళ్లలో జగన్ చేసింది ఇదే!

పెందుర్తితో పాటు ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్‌ టిక్కెట్లను చంద్రబాబు జనసేనకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నాలుగు చోట్ల టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడ్డ తమను పక్కనపెట్టి ఇప్పుడు జనసేనకు టిక్కెట్లు కేటాయించడం పట్ల గుర్రుగా ఉన్నారు. తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. వీరందరినీ బండారు సత్యనారాయణ ఒక్క చోట చేరుస్తున్నట్లు సమాచారం. ఈ నేతలంతా త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

Back to top button