తెలుగు
te తెలుగు en English
సినిమా

OTT: ఓటీటీలోకి రానున్న ‘ఆపరేషన్ వాలంటైన్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..!

శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’ మార్చి 1న విడుదలైంది. పుల్వామా దాడి, భారతదేశం ఉగ్రవాదులకు ఇచ్చిన కౌంటర్ అటాక్ లాంటి యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. మార్చి 29న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

ALSO READ: గుడ్ న్యూస్.. ఓటిటిలోకి వచ్చేసిన హనుమాన్ మూవీ

దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం.. దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ రూపొందించారు. ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ ఇండియన్‌ ఎయిర్‌ పైలట్‌గా అద్భుతంగా నటించారు. హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో మెప్పించారు. ఈ సినిమా హిందీలోనూ హిట్ టాక్ తెచ్చుకుంది. రుహానీ శర్మ, నవదీప్, శతాఫ్, సంపత్, పరేష్ పహుజా, అభినవ్ గోమఠం, అలీ రాజా, శ్వేతవర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button