తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

HanuMan: గుడ్ న్యూస్.. ఓటిటిలోకి వచ్చేసిన హనుమాన్ మూవీ

బ్లాక్ బస్టర్ హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై దాదాపు 2 నెలలు గడుస్తున్నా ఇంతవరకు హనుమాన్ ఓటీటీ గురించి అప్డేట్ ఇవ్వడం లేదని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల మార్చ్ 8న శివరాత్రి కానుకగా హనుమాన్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, కొన్ని టెక్నీకల్ సమస్య కారణంగా అది కుదరలేదు.

Also read: Pooja Hegde: మూడోసారి జతకడుతున్న పూజా హెగ్డే.. అట్లీ మూవీలో ఛాన్స్

అయితే తాజాగా శనివారం నుండి హనుమాన్ హిందీ వర్షన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకున్న జియో సినిమాస్ స్ట్రీమింగ్ చేస్తోంది. ఒకపక్క హనుమాన్ హిందీ వర్షన్ గురించి ఎదురుచూసిన ఆడియన్స్ కు మరో షాకిచ్చారు మేకర్స్. హనుమాన్ తెలుగు వర్షన్ ను కూడా జీ5 సంస్థ అందుబాటులోకి తెచ్చింది. అలా సడన్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన హనుమాన్ తెలుగు వర్షన్ ను చూసి ఒక్కసారిగా హ్యాపీ ఫీలయ్యారు ఆడియన్స్. సినిమా చూద్దాం అని ఆశగా ఓపెన్ చేసిన ఆడియన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇచ్చింది జీ5 సంస్థ.

అదేంటంటే.. హనుమాన్ తెలుగు స్ట్రీమింగ్ కోసం పేమెంట్ మెథడ్ ను ఎంచుకున్నారు. అంటే.. ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ నుండి ఛార్జెస్ వసూలు చేస్తోంది జీ5 సంస్థ. ఇది చూసిన జీ5 సబ్ స్క్రైబర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పటికే సబ్ స్క్రిప్షన్ కోసం పే చేయగా.. ఇప్పుడు సినిమా చూడటానికి మళ్లీ పేమెంట్ అంటే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ జీ5 సంస్థను ఆడేసుకుంటున్నారు. హనుమాన్ సినిమాకు ఇపుడు క్రేజ్ ఉంది కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుందాం అని అనుకున్నారు. ఇది యాపారం.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

Back to top button