తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Pooja Hegde: మూడోసారి జతకడుతున్న పూజా హెగ్డే.. అట్లీ మూవీలో ఛాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప2 చేస్తున్న ఆయన.. మరో రెండు భారీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు. అందులో దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఒకటికాగా.. మరొకటి తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో చేయబోయే ప్రాజెక్టు ఉంది. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

Also read: Vizag: వైజాగ్ లో మెరిసిన అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్

ముఖ్యంగా అట్లీతో అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కారణం దర్శకుడు అట్లీ ఈ మధ్యే షారుఖ్ ఖాన్ తో జవాన్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఇక త్వరలో రానున్న పుష్ప2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకునే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది. అందుకే అల్లు అర్జున్, అట్లీ కుమార్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేని ఫిక్స్ చేశారట మేకర్స్. ఇప్పటికే ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో DJ, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బన్నీతో జతకట్టబోతోంది పూజ. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. మరి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button